
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆగస్టు 14న సినిమా విడుదలవుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచారు మేకర్స్. గురువారం హీరోయిన్ కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. హృతిక్ రోషన్, కియారా జంటపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రీతమ్ కంపోజ్ చేయగా ‘‘నీ గుండె గుమ్మంలోకి ప్రతీ రోజూ వస్తూ పోతుంటా ఊపిరి ఊయలగా...’ అంటూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు.
శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ పాడారు. విదేశాల్లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. హృతిక్, కియారాల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసింది. కియారా బికినీలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.