Viral Video: వర్షాలకు స్వాగతం... కాశీలో కప్పల పెళ్లి

Viral Video: వర్షాలకు స్వాగతం... కాశీలో  కప్పల పెళ్లి

ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి గ్రామాల్లో చేస్తుంటారు. మరికొన్నిచోట్ల వర్షాల కోసం వరుణయాగం, కబడ్డీ ఆటలు, పాటలు పాడటం చేస్తారు. కప్పలకు పెళ్లి చేస్తే దేవ దేవేంద్రుడి కరుణతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో కప్పలకు ఈ వింత పెళ్లి చేస్తుంటారు. వరుణుడి కటాక్షం కోసం ఉత్తరప్రదేశ్​ లోని వారణాసి( కాశి)లో  ఘనంగా కప్పల పెండ్లి జరిపించారు. కప్పలకు పెండ్లి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అచ్చం  మనుషుల పెళ్లిలానే వీటికి వివాహం జరిపించారు. కప్పల పెళ్లి వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. Khabar Lahariya అనే ట్విట్టర్​ ఖాతా నుంచి పోస్ట్​ చేశారు .

పూర్తి సంప్రదాయ పద్దతిలో శాస్త్రోక్తంగా ఈ వివాహం జరిపించారు. కప్పలను వధూవరుల మాదిరిగానే అలంకరించి.. తాళి బొట్టు, పూల దండలు మార్చుకోవడం, సప్తపది, తలంబ్రాలు అన్నీ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.గ్రామస్తులు ఆద్వర్యంలో వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలని కప్పలకు పెళ్ళి చేసి పూజలు నిర్వహించారు.పెళ్ళి అనంతరం వాటిని ఊరంతా ఊరేగింపు నిర్వహించారు. పురోహితుడు ఆధ్వర్యం లో మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కప్పలకు పెళ్లి చేసి ఊరంతా ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయి అంటున్నారు గ్రామస్తులు.. కప్పల పెళ్లి సందర్భంగా  వాయిద్యాలు వాయిస్తూ, భజనలు పాడుతూ మహిళలు సందడి చేశారు.