మెగాస్టార్ చిరంజీవి సరసన 'అందరివాడు' మూవీలో నటించిన హీరోయిన్ రిమీ సేన్ గుర్తుందా? తన అమాయకమైన చూపులతో, క్యూట్ నటనతో టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఒక వెలుగు వెలిగిందీ బ్యూటీ. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పూర్తిగా తన రూపురేఖలు మార్చేసి ఒక కొత్త అవతారంలో కనిపిస్తోంది. అయితే ఇది ఏదైనా సినిమా కోసం అనుకుంటే పొరపాటే.. ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తి స్వస్తి చెప్పేసింది. దుబాయ్‌లో సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది. లేటెస్ట్ గా రిమీ సెన్ సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
గ్లామర్ లోకం నుంచి రియల్ ఎస్టేట్ వైపు..
బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలైన 'ధూమ్', 'ధూమ్ 2', 'హంగామా', 'గోల్‌మాల్' వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది రిమీ సేన్. 2011లో వచ్చిన 'షాగీర్డ్' తర్వాత వెండితెరకు దూరమైంది. మధ్యలో బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో కనిపించినా.. నటిగా మాత్రం బిజీ కాలేకపోయింది. దీంతో సినీ ఇండస్ట్రీకి పూర్తిగా స్వస్తి చెప్పేసింది. కానీ, లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆమె ఇప్పుడు దుబాయ్‌లో స్టార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిపోయింది. కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ విల్లాలు, ప్రాపర్టీలను ఆమె సేల్ చేస్తూ గ్లోబల్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాలు ఎందుకు వదిలేశారంటే?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రిమీ సేన్ తన కెరీర్ మార్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. పెళ్లయ్యాక లేదా కొంత వయసు వచ్చాక అవకాశాలు తగ్గిపోతాయి. కానీ వ్యాపారంలో మనమే బాస్‌గా ఉండొచ్చు. అందుకే నేను ముందుగానే ప్లాన్ చేసుకుని రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాను" అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, భారత్‌లో వ్యాపారం చేయడం కంటే దుబాయ్‌లో నిబంధనలు సులభంగా ఉంటాయని, అందుకే అక్కడ సెటిల్ అయ్యానని ఆమె వివరించింది.
►ALSO READ | With Love Review: స్కూల్ డేస్ క్రష్ ఒక మధుర జ్ఞాపకం! అనస్వర రాజన్ 'విత్ లవ్' హిట్టా? ఫట్టా?
గుర్తుపట్టలేనంతగా ..
రిమీ సేన్ షేర్ చేసిన తాజా వీడియోల్లో ఆమె లుక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్స్ చేయగా, ఆమె వాటిపై చాలా ఓపెన్‌గా స్పందించారు. నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు.. కేవలం ఫిల్లర్స్, బొటాక్స్ ట్రీట్‌మెంట్స్ మాత్రమే చేయించుకున్నాను. నా చర్మాన్ని మెరుగుపరుచుకోవడంలో తప్పేముంది? అని ధీటుగా సమాధానమిచ్చారు.
ప్రస్తుతం ఆమె దుబాయ్‌లోని టాప్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలతో కలిసి పని చేస్తూ, లగ్జరీ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు చిరంజీవి పక్కన గ్లామరస్‌గా కనిపించిన ఈ నటి, ఇప్పుడు కోట్లు గడించే బిజినెస్ ఉమెన్‌గా మారడం చూసి నెటిజన్లు "రియల్ లైఫ్ గోల్‌మాల్" అంటే ఇదే అంటూ ప్రశంసిస్తున్నారు.
I didn't recognise her for a moment 😳🤯 Paiso ka chkkar babu bhaiya #PhirHeraPheri #Humgama actress #RimiSen now working as a real Estate agent in Dubai pic.twitter.com/79oZIdNnRy
— $@M (@SAMTHEBESTEST_) February 5, 2026
