బాలీవుడ్ సెలబ్రిటీలు రాఖీని ఎలా జరుపుకుంటారో తెలుసా.. ?

బాలీవుడ్ సెలబ్రిటీలు రాఖీని ఎలా జరుపుకుంటారో తెలుసా.. ?

ప్రేమకు, ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షా బంధన్. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ వేడుకను బాలీవుడ్ సెలబ్రెటీలు సైతం ఘనంగా జరుపుకుంటారు. అందరిలాగే తమ సోదరులకు రాఖీ కట్టి... ప్రేమాభిమానాలను పంచుకుంటారు. వారిలో కొందరు ప్రముఖ బాలీవుడ్ నటులు రక్షా బంధన్ ను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

సల్మాన్ - అతని సోదరులు

ఇందులో భాగంగా నటుడు సల్మాన్ ఖాన్ కూడా రాఖీ పండగను తన ఫ్యామిలీతో కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా సోహైల్, అర్బాజ్, ఆయుష్ లతో పాటు తన మేనల్లుళ్లతో కలిసి రాఖీలు కట్టుకొని ఉన్న చేతులను చూపిస్తూ ఫోజులిచ్చిన ఫొటో... వారి ప్రేమాభిమానాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఇక సల్మాన్ గురించి చెప్పాలంటే ఆయనకు ఇద్దరు సోదరీమణులున్నారు. వారే- అల్విరా, అర్పిత. అందరి లాగే వీరిద్దరూ కూడాప్రతి సంవత్సరం సల్మాన్‌కి రాఖీ కట్టి, దానికి ప్రతిగా ‘భాయిజాన్‌’ని బుజ్జగించడం ఎప్పుడూ జరిగేదే.

రిద్దిమా - రణ్ బీర్

రిద్ధిమా కపూర్ పెళ్లి చేసుకుని చాలా కాలం తర్వాత ఢిల్లీకి వచ్చింది. మొన్నటి వరకు ఆమె వెలుగులోకి రాలేదు. గత సంవత్సరంలో రిద్ధిమా పబ్లిక్ ఫోరమ్‌లలో, టీవీ షోలలో రణబీర్‌తో తన బంధం గురించి చెప్పిన విషయం తెలిసిందే. తామిద్దరం మంచి తోబుట్టువులుగా ఎంత సన్నిహితంగా ఉంటారో ఆమె తెలిపింది. అయితే నేడు రక్షా బంధన్ సందర్భంగా దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఆమె తల్లి నీతూ కపూర్ పోస్ట్ చేసిన ఈ సుందరమైన చిత్రాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందాం.

ప్రియాంకా - సిద్ధార్థ్

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. నిక్ జోనాస్‌తో వివాహం అనంతరం ఆమె మరింత బిజీగా మారిపోయింది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో విహరిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. దీంతో ఆమె తన సోదరుడు సిద్దార్థ్ తో కలిసి గడిపే సమయం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత రక్షా బంధన్ సందర్భంగా తన సోదరుడితో కలిసి ఉండే అవకాశం లభించిందని ప్రియాంక గతేడాది సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ఇక ప్రియాంక సోదరుడు హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్ చెఫ్. అతనికి పూణేలో రెస్టారెంట్లు కూడా ఇన్నాయి. అంతే కాదు తన చెల్లితో, తల్లితో కలిసి కొన్ని సినిమాల్లోనూ కనిపించాడు.

కార్తీక్ - క్రితిక

కార్తీక్ ఆర్యన్ తన సోదరి క్రితికతో చాలా సన్నిహితంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెతో సరదాగా వీడియోలు చేస్తూ తరచుగా కనిపిస్తాడు.  అయితే ప్రతీ సంవత్సరం కార్తీక్ తన సోదరితో ఉన్న చిత్రాన్ని రక్షా బంధన్ గుర్తుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అంతే కాదు దానికి ఫన్నీ క్యాప్షన్ ను కూడా ఇస్తాడు! 2020లో, ఆమె మెడికల్ స్కూల్ పూర్తి చేసింది. అదే సంవత్సరంలో రాఖీ సందర్భంగా, కార్తీక్ ఆమెతో ఉన్న ఓ అందమైన చిత్రాన్ని పోస్ట్ చేసి, “ఒక డాక్టర్ గా ఆమెకు ఆమెను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపై ఉంది అంటూ క్రితిని ట్యాగ్ చేశాడు కార్తీక్.