నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే రూ. వెయ్యి ఫైన్

V6 Velugu Posted on Dec 02, 2021

నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రూ. వెయ్యి ఫైన్ విధిస్తారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.  ‘తెలంగాణలో ఇంకా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోలేదు. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కలుపుకొని జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 15 లక్షల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారున్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే మీ ప్రాణాలను మీరే తీసుకున్నట్లు అవుతుంది. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్క్ కూడా పెట్టుకోవాలి. వ్యాక్సిన్ కన్నా మాస్క్ పవర్ ఫుల్ వెపన్. మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల ఫైన్ నేటినుంచి తిరిగి అమల్లోకి వస్తోంది. అన్ని ఆఫీసులలో, బహిరంగ ప్రదేశాలలో మాస్క్ తప్పకుండా ధరించాలి. వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అందుకే మీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మీ ఫోన్ లో గానీ, లేదా హార్డ్ కాపీని వెంట ఉంచుకోవాలి. ఎక్కడైనా చెకింగ్ జరగొచ్చు. త్వరలోనే కొత్త గైడ్ లైన్స్ విడుదల చేస్తాం’ అని ఆయన తెలిపారు.

Tagged Hyderabad, Telangana, corona virus, Mask, fine without mask, DH Srinivasa Rao, omicron, Covid virus, fine for mask

Latest Videos

Subscribe Now

More News