తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజ్ సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు వాహనంలో ఉన్న గాయపడిన వారి పట్టించుకోకుండా పండ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు.
చేతికి చిక్కినన్ని పండ్లు తీసుకెళ్లడంతో కొన్ని నిమిషాల్లోనే డీసీఎంలోని దాదాపు మొత్తం లోడు ఖాళీ అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు.
ప్రమాదం జరిగినప్పుడు బాధితులను రక్షించడం వదిలేసి కొందరు పండ్లను తీసుకెళ్లడం విమర్శలకు తావిస్తోంది.
