ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

ఐటీ ఆన్‌లైన్‌ కోర్సులకు మస్తు డిమాండ్

ఆటోమేషనే ఎట్రాక్షన్‌
భారీగా పెరుగుతున్న ఆడ్మిషన్లు
ఉద్యోగులు, నిరుద్యోగులూ కూడా క్యూ కడుతున్నరు

బెంగళూరు: చాలా కంపెనీలు జాబ్స్‌‌‌‌‌‌‌‌ను తీసేసినప్పటికీ, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు తమ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ను డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి చాలా ఇంపార్టెన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. ఐటీ కోర్సులను నేర్పే సంస్థల అడ్మిషన్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కంపెనీలు కూడా తమ ఉద్యోగుల స్కిల్స్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపర్చడానికి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాయి. తిరిగి సాధారణ పరిస్థితులకు వచ్చాక ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను పూర్తి చేయడానికి వీరిని ముందు నుంచే ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్‌‌‌‌‌‌‌‌, క్లౌడ్‌‌‌‌‌‌‌‌, ఏఐ వంటి టెక్నాలజీ కోర్సులకు ఎక్కువ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉందని ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థలు చెబుతున్నాయి. టెక్నాలజీ కోర్సులకు గత రెండు నెలల నుంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోందని ఎమర్జింగ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ సంస్థ జిగ్‌‌‌‌‌‌‌‌సా అకాడమి సీఈఓ గౌరవ్‌‌‌‌‌‌‌‌ వోహ్రా అన్నారు. కరోనా ఔట్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత నుంచి తమ కోర్సులపై ఆసక్తి చూపే వారు 70–8‌‌‌‌‌‌‌‌0 శాతం పెరిగారని పేర్కొన్నారు. నిర్ధిష్టమైన అవసరాలకు తగ్గట్టు కోర్సులను ఎంచుకోవడం పెరిగిందని అన్నారు.

భారీ పెరుగుదల
ఇండియాలో తమ కోర్సులలో జాయిన్‌‌‌‌‌‌‌‌ అయిన వారు 200 శాతం పెరిగారని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ ఉడెమీ పేర్కొంది. టెక్నికల్‌‌‌‌‌‌‌‌ కేటగిరిలో వెబ్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, డేటా సైన్స్‌‌‌‌‌‌‌‌ కోర్సులలో 60 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ ఉందని చెప్పింది. కొత్త కోర్సులను తీసుకురావడంలో గ్రోత్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తోందని ఉడెమీ ఇండియా ఎండీ ఇర్విన్‌‌‌‌‌‌‌‌ ఆనంద్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఐటీ, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం తమ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో కొత్త కోర్సులను తీసుకురావడం 77 శాతం పెరిగిందని చెప్పారు. కంపెనీలు లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ను వాడుకునేందుకు ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ గ్రేట్‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఓ కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ అకాడమీని లాంఛ్‌‌‌‌‌‌‌‌ చేసింది. గత నెల తమ యాక్టివ్‌‌‌‌‌‌‌‌ యూజర్లలో 25 శాతం మంది ఒక కోర్సునైనా పూర్తి చేశారని గ్రేట్‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ సీఈఓ మోహన్‌‌‌‌‌‌‌‌ అన్నారు. వీరు కనీసం రోజుకు రెండు గంటలైనా నేర్చుకుంటున్నారని, గత రెండు నెలల్లో యాప్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలేషన్స్‌‌‌‌‌‌‌‌ కూడా 200 శాతంపెరిగాయని చెప్పారు.

వీటికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ..
క్లౌడ్‌‌‌‌‌‌‌‌, డేటా సైన్స్‌‌‌‌‌‌‌‌, ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌(ఏఐ), మెషీన్‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌(ఎంఎల్‌‌‌‌‌‌‌‌), సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ కోర్సులకు ఎక్కువ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉందని ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్లు పేర్కొన్నారు. జిగ్‌‌‌‌‌‌‌‌సా అకాడమీలో ఏఐ, క్లౌడ్‌‌‌‌‌‌‌‌ కోర్సులకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ 250 శాతం పెరిగిందని ఈ సంస్థ తెలిపింది. క్లౌడ్‌‌‌‌‌‌‌‌, యాప్‌‌‌‌‌‌‌‌ డెవెలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, ఎంఎల్‌‌‌‌‌‌‌‌ వంటి కోర్సులకు 40 శాతం డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగిందని స్ప్రింగ్‌‌‌‌‌‌‌‌ పీపుల్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ పెరుగుతుండడంతో దీనికి రిలేటెడ్‌‌‌‌‌‌‌‌ కోర్సులకు కూడా మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని ఎనలిస్టులుచెబుతున్నారు. ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ రిలేటెడ్‌‌‌‌‌‌‌‌ కోర్సులకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోందని, వీటికి తోడు సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీకి మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉందని గార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీడీ మిశ్రా అన్నారు. గతంలో బీ2బీ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ రెండింట్లోనూ జరిగేది. ప్రస్తుతం ఇది ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. గతంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కంటెంట్‌‌‌‌‌‌‌‌ చదివాక, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఫేస్‌‌‌‌‌‌‌‌ టూ ఫేస్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ షాప్స్‌‌‌‌‌‌‌‌ జరిగేవని జిగ్స్‌‌‌‌‌‌‌‌షా అకాడమీ పేర్కొంది. ప్రస్తుతం ఇది మారుతోందని తెలిపింది.

నిరుద్యోగులూ నేర్చుకుంటున్నారు..
కరోనా దెబ్బతో ఐటీ ఇండస్ట్రీలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. జాబ్‌‌లేని వాళ్లు తమటైమ్‌‌ను వాడుకుంటున్నారని, తమ స్కిల్స్‌‌ను డెవలప్‌‌ చేసుకుంటున్నారని ఈ-లెర్నింగ్ ‌‌సంస్థలు చెబుతున్నాయి. ఇలాంటి వారికి సాయం చేస్తున్నామని అన్నాయి. ఎంటర్‌‌ప్రైజ్ ‌‌ట్రైనింగ్ ప్రొవైడర్‌ స్ప్రింగ్‌ ‌పీపుల్‌ తమ లెర్నింగ్ ‌‌ప్లాట్‌‌ఫామ్ ‌‌ద్వారా ఇటువంటి వారికి ఫ్రీగా కోర్సులను అందిస్తోంది. దీంతో వీరు తమ స్కిల్స్‌‌ను పెంచుకోగలుగుతారని, భవిష్యత్‌‌లో జాబ్స్‌‌ను సంపాదించగలుగుతారని స్ప్రింగ్ ‌‌పీపుల్ ‌ఫౌండర్‌ రవి కక్లసరియా అన్నారు.లాక్‌‌డౌన్ ‌తర్వాత తమ ప్లాట్‌‌ఫామ్‌ ‌‘లిండ్‌‌క్లౌడ్‌‌’లో యూజర్లు రెట్టింపు అయ్యారని పేర్కొన్నారు.

For More News..

చైనా మాల్‌ తగ్గించేందుకు కొత్త ప్లాన్

ఫిక్సింగ్‌‌‌‌ను ఇండియాలో క్రైమ్‌‌‌‌గా చూడాలి

కరోనా ఎఫెక్ట్: కన్నవాళ్లు చనిపోయినా శవాన్ని ఇంటికి తీసుకెళ్లలేని పిల్లలు