రేవంత్  గాంధీ లోపలికి వెళ్లకుండా ఫుల్ సెక్యూరిటీ

రేవంత్  గాంధీ లోపలికి వెళ్లకుండా ఫుల్ సెక్యూరిటీ

హైదరాబాద్: సికింద్రాబాద్ ఘటనలో గాయపడ్డ ఆర్మీ అభ్యర్థులను గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం తెలిసిందే. వారిని పరామర్శించడానికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెళ్తానని ప్రకటించిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలోపలికి వెళ్లడానికి రేవంత్ రెడ్డికి పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ గేట్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హాస్పిటల్ లోపలకి వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అంబులెన్సు లను సైతం చెక్ చేసి పంపుతున్నారు. అర కిలోమీటరు దూరంలోనే రేవంత్ ను అడ్డుకుని... అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.