ఫండ్స్ ఖర్చు చేస్తలె.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం

ఫండ్స్ ఖర్చు చేస్తలె.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం
  • నియోజకవర్గ నిధులపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం
  • గత ఆరేండ్లుగా ఇదే తీరు
  • చాలా మంది సగం ఫండ్స్ కూడా ఖర్చు చేయడం లేదు

హైదరాబాద్, వెలుగు: తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులను ఖర్చు చేయడంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్లక్ష్యం చేస్తున్నారు . సర్కార్తో కొట్లాడి అదనపు నిధులు తీసుకురావడం దేవుడెరుగు.. ఉన్న నిధులనే ఖర్చు చేయలేకపోతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కొలువు దీరిన ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మొదటి రెండేళ్లు ఒక్కో నియోజకవర్గానికి ఏడాదికి రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించగా, తర్వాత మూడేళ్లు రూ.3 కోట్ల చొప్పున కేటాయించింది. స్కూల్ బిల్డింగ్స్, నాలాలు, బోరుబావులు, సీసీ రోడ్లు, వీధి లైట్ల నుంచి మొదలు పెడితే నియోజకవర్గంలో అవసరమైన ఎన్నో పనులకు ఈ నిధులను ఉపయోగించే అవకాశముంది. గవర్నర్ కోటా, అసెంబ్లీ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ లైతే తమకు విడుదలైన నిధులను రాష్ట్రంలో ఎక్కడైనా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. మిగతా ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల అభివృద్ధికే వెచ్చించాలి. కానీ నిధులు పూర్తిగా సద్వినియోగం కావడం లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు తమ పదవీకాలంలో విడుదలైన సీడీఎఫ్ నిధులను సగం కూడా ఖర్చు చేయలేకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.

ఐదేళ్లలో అంతంతే..

2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూ.1,440 కోట్లు విడుదల చేయగా, వారు ఖర్చు చేసిం ది రూ.974.85 కోట్లే. మరో 465.15 కోట్లు ఖర్చు చేయలేదు. ఎమ్మెల్సీల పనితీరు కూడా ఇలానే ఉంది. వారికి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.460.50 కోట్లు విడుదల చేయగా.. రూ.254.08 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరో 206.42 కోట్లను ఖర్చు చేయలేకపోయారు. జలగం సుధీర్ అనే ఆర్టీఐ యాక్టివిస్టు ఇటీవల ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా ఈ వివరాలు వెల్లడించింది.

ఐదేళ్లలో ఇలా..

ఎమ్మెల్యేలకు విడుదలైన నిధులు

1,440 కోట్లు

ఖర్చు చేసిన నిధులు

974.85 కోట్లు

ఎమ్మెల్సీలకు విడుదలైన నిధులు

460.50 కోట్లు

ఖర్చు చేసిన నిధులు

254.08 కోట్లు

 

ఎమ్మెల్యేలకు విడుదలైన నిధులు, చేసిన ఖర్చు (రూ.కోట్లలో)

సంవత్సరం                         విడుదలైన నిధులు                 ఖర్చు  చేసిన నిధులు

2014-15                                    180                                 147.75

2 015-16                                    180                                 146.64

2016-17                                    360                                  276.24

2017-18                                    360                                 240.93

2018-19                                    360                                 163.59

 

ఎమ్మెల్సీలకు విడుదలైన నిధులు, చేసి న ఖర్చు (రూ.కోట్లలో)

సంవత్సరం                         విడుదలైన నిధులు                 ఖర్చు చేసిన నిధులు

2014-15                                54                                        37.77

2 015-16                              46.50                                    27.10

2016-17                              120                                        78.20

2017-18                              120                                        73.37

2018-19                             120                                         37.64