మదనాపురం, వెలుగు: మదనాపురం మండలంలోని సరళ సాగర్, కురుమూర్తి రాయ, నెలివిడి ఎత్తిపోతల పథకాల రిపేర్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే.జీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సరళ సాగర్ లిఫ్ట్ పునరుద్ధరణకు రూ.1.94కోట్లు, కురుమూర్తి రాయ లిఫ్ట్ కు రూ.1.45 కోట్లు, నేలివిడి లిఫ్ట్ కు రూ.92లక్షలు మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు.
