Hyderabad : పారిశుధ్యానికి నిధులు కేటాయించాలి

Hyderabad : పారిశుధ్యానికి నిధులు కేటాయించాలి

హైదరాబాద్ సిటీ, వెలుగు: పారిశుద్ధ్యానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకులు గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లను అరికట్టేందుకు చెత్తను తొలగించి దోమల నివారణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ కు వినతిపత్రం అందించారు. మాస్ లైన్ గ్రేటర్ కార్యదర్శి ఎం.హన్మేష్, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎల్.పద్మ, నాయకులు ప్రదీప్, రవికుమార్, లింగంగౌడ్   పాల్గొన్నారు.