ధరణిలోని ఎడిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ..కోడింగ్ ముసుగులో నిధులు దారి మళ్లించారా .?

ధరణిలోని ఎడిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ..కోడింగ్ ముసుగులో నిధులు దారి మళ్లించారా .?
  • ధరణి బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఎండ్‌‌‌‌‌‌‌‌లోనూ నంబర్ల ట్యాంపరింగ్‌‌‌‌‌‌‌‌ జరిగిందనే అనుమానాలు
  •     చిన్న చార్జీలకు ‘లాక్‌‌‌‌‌‌‌‌’..భారీ చెల్లింపులకు ‘ఎడిట్‌‌‌‌‌‌‌‌’ ఉండడంతో అక్రమాలకు చాన్స్
  •     కేటగిరీని మార్చి ప్రభుత్వ ఆదాయం దారిమళ్లించారా? అనే కోణంలో హైలెవల్​ కమిటీ దర్యాప్తు
  •     జనరేటైన చలానా ఎంత? ఖజానాకు చేరిందెంత? ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ లెక్కల్లో ఉన్నదెంత? అని ఆరా
  •     దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన 52 లక్షల లావాదేవీల జల్లెడ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును టెర్రాసిస్ సంస్థలో ఎవరైనా దారి మళ్లించారా? ధరణి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బ్యాక్‌‌‌‌‌‌‌‌ఎండ్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ కోడింగ్‌‌‌‌‌‌‌‌లో కేటగిరీని మార్చడం ద్వారా చేతివాటం ప్రదర్శించారా? అనే కోణంలో ప్రభుత్వం నియమించిన హైలెవెల్ కమిటీ దర్యాప్తు చేస్తున్నది. ధరణి వచ్చినప్పటి నుంచి అసలు ఎంత చలానా జనరేట్ చేశారు? క్షేత్రస్థాయిలో రైతులు ఎంత కట్టారు? ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రికార్డుల్లో ఎంత చూపించారు? కేటగిరీ, ల్యాండ్​వ్యాల్యూ ఏమైనా మార్చారా? అన్న అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నది. 

ఇందుకోసం ప్రతి లావాదేవీని ఆరు దశల్లో వడపోస్తున్నది. ఇటీవల జనగామ, యదాద్రి జిల్లాల్లో బయటపడిన అక్రమ చలాన్ల వ్యవహారంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుని స్టాంప్స్​అండ్​ రిజిస్ర్టేషన్​శాఖ ఉన్నతాధికారులతో హైలెవెల్​కమిటీ వేసింది. ఈ వ్యవహారం మీ సేవా, ఇంటర్నెట్​సెంటర్లకే పరిమితం కాలేదని.. ధరణి నిర్వాహకుల స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, యూజర్ చార్జీలకు లాక్ వేసి.. కేవలం మార్కెట్ వాల్యూ, టోటల్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలకు మాత్రం ‘ఎడిట్’ ఆప్షన్ ఇవ్వడాన్ని ఎత్తిచూపుతున్నారు. ధరణి, భూభారతిలో కలిపి ఇప్పటివరకు సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన 52 లక్షల లావాదేవీలు జరిగాయి. కాగా, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టల్​నిర్వహణను పూర్తిగా నేషనల్​ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మాటిక్​ సెంటర్​(ఎన్ఐసీ)కి అప్పగించింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో హైలెవల్​కమిటీ ప్రస్తుతం ధరణిలో జరిగిన 40 లక్షల ట్రాన్సాక్షన్లను ఎండ్ టు ఎండ్ జల్లెడ పడుతున్నది. 

వ్యాల్యూ తగ్గించి.. కేటగిరీ మార్చి!

సాధారణంగా ల్యాండ్​రిజిస్ట్రేషన్లలో లావాదేవీ స్వభావం ఆధారంగా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ (కుటుంబ సభ్యులు), మార్టిగేజ్, పార్టిషన్, రిలీజ్ డీడ్, జీపీఏ, ఎక్స్ఛేంజ్ డీడ్ అంటూ ప్రధానంగా ఏడు రకాల కేటగిరీలు ఉంటాయి. వీటిలో ‘సేల్ డీడ్’ లేదా బయటి వ్యక్తులకు ఇచ్చే గిఫ్ట్ డీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. అదే కుటుంబ సభ్యుల మధ్య జరిగే గిఫ్ట్, పార్టిషన్ డీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మాత్రం  నామమాత్రపు చార్జీలు ఉంటాయి. సరిగ్గా ఈ అంతరాలనే ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ హైలెవల్​ కమిటీ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ‘సేల్ డీడ్’ కింద పూర్తి చార్జీలను వసూలు చేసి, బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండ్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ లావాదేవీని ‘ఫ్యామిలీ గిఫ్ట్ డీడ్’ లేదా ‘పార్టిషన్’ కేటగిరీకి మార్చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇలా కేటగిరీలను తారుమారు చేయడం వల్ల.. ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన సింహభాగం నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు ఒక రైతు 'సేల్ డీడ్' కోసం రూ.50 వేల ఫీజు కట్టారనుకుందాం.

 డెవలపర్లు బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండ్ కోడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ లావాదేవీని 'ఫ్యామిలీ గిఫ్ట్ డీడ్' (దీని ఫీజు సుమారు రూ.5 వేలు అనుకుందాం) కింద మార్చేస్తే.. ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేలు మాత్రమే వెళ్తుంది. మిగిలిన రూ.45 వేలు పక్కదారి పట్టినట్టే. భూ రిజిస్ట్రేషన్లలో కేవలం సేల్, గిఫ్ట్, పార్టిషన్ వంటి కేటగిరీల మార్పిడితోనే కాకుండా.. ‘వాల్యూ’ ఎంట్రీలోనూ  గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్ జరిగిందా? అనేది కూడా చూస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ మార్కెట్ విలువ లేదంటే వాస్తవ విక్రయ విలువ వీటిలో ఏది ఎక్కువైతే దానిపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఎకరం భూమి ప్రభుత్వ విలువ రూ.5 లక్షలు ఉందనుకుందాం. కానీ అక్కడ బహిరంగ మార్కెట్ రేటు రూ.20 లక్షలు పలుకుతోంది. కొనుగోలుదారుడు బ్యాంకు లోన్ కోసమో, బ్లాక్ మనీ సమస్య రాకూడదనో రూ.20 లక్షల విలువకు సరిపడా (సుమారు 7.5% చొప్పున రూ.1.5 లక్షలు) రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అక్రమార్కులు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ మాయాజాలంతో ఆ లావాదేవీని కేవలం ప్రభుత్వ విలువైన రూ.5 లక్షలకే జరిగినట్లు (దీని చార్జీ సుమారు రూ.37,500 మాత్రమే)  ఎంట్రీ అయ్యేలా చేస్తారు. అంటే రైతు నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేసి, ప్రభుత్వ ఖజానాకు కేవలం రూ.37,500 జమ చేసి, మిగతా లక్షకు పైగా సొమ్మును స్వాహా చేసే ఆస్కారం ఉంది. ఇలా అటు విలువను తగ్గించి చూపి, ఇటు కేటగిరీని మార్చి రెండు రకాలుగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారా? అన్నది తేలాల్సి ఉంది.

ఆ ‘ఎడిట్’ ఆప్షన్ ఎవరి కోసం?

ధరణి పోర్టల్ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే అనేక లోపాలు ఉన్నాయని, అవి ఉద్దేశపూర్వకంగా వదిలేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ చార్జీలు, యూజర్ చార్జీల వంటి చిన్న మొత్తాలకు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘లాక్’ వేసి మార్చడానికి వీల్లేకుండా చేశారు. కానీ, అసలు ఆదాయం వచ్చే మార్కెట్ వాల్యూ, టోటల్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల విషయంలో మాత్రం ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులో ఉంచారు.  చలానా జనరేట్ అయ్యాక డబ్బులు కట్టే సమయానికి, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించే లెక్కకు మధ్య తేడా సృష్టించేందుకే.. ఈ ఎడిట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దుర్వినియోగం చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎడిట్ వెసులుబాటు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, ప్రైవేటు వ్యక్తులు జేబులు నింపుకున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 52 లక్షల భూలావాదేవీలు జరగగా, ఇందులో అత్యధికంగా 40 లక్షల ట్రాన్సాక్షన్స్ ఒక్క ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నమోదయ్యాయి. ఈ లావాదేవీల విలువ దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత భారీ డేటాబేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించడం సవాలే అయినా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ  వెనక్కి తగ్గడం లేదు. డబ్బులు చెల్లించిన బ్యాంకు రికార్డులు, పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదైన రికార్డులు, చివరగా జనరేట్ అయిన డాక్యుమెంట్లను కూడా సరిచూస్తున్నట్లు తెలుస్తున్నది. 

కోడింగ్ ముసుగులో కన్నం వేశారా?

గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ‘టెర్రాసిస్’ సంస్థ కార్యకలాపాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అర్థం కాని సాంకేతికతను అడ్డం పెట్టుకుని, బ్యాక్‌‌‌‌‌‌‌‌ఎండ్‌‌‌‌‌‌‌‌లో డెవలపర్స్ సాయంతో కోడింగ్‌‌‌‌‌‌‌‌లోనే నంబర్స్ ఏమైనా ట్యాంపర్ చేశారా? అనే కోణంలో విచారణ వేగవంతమైంది. సాధారణంగా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌లో జరగాల్సిన లెక్కలకు, వాస్తవంగా జరిగిన లావాదేవీలకు పొంతన ఉందా? లేదా? అని వెరిఫై చేస్తున్నారు. కేవలం టెక్నికల్ గ్లిచ్ పేరుతో సరిపెట్టకుండా, ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన ‘డిజిటల్ దోపిడీ’నా అనే దిశగా ఎంక్వైరీ సాగుతోంది. రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరకుండా, మధ్యలోనే మాయమైందా? కోడింగ్ దశలోనే సంఖ్యలను తారుమారు చేసి నిధులు దారి మళ్లించారా? అని హైలెవెల్ కమిటీ ఆరా తీస్తోంది.