ఫ్యూచర్ సిటీ ఆఫీస్ నిర్మాణానికి రూ.19 కోట్లు.. అటు సైడ్ భూముల ధరలకు రెక్కలు

ఫ్యూచర్ సిటీ ఆఫీస్ నిర్మాణానికి రూ.19 కోట్లు.. అటు సైడ్ భూముల ధరలకు రెక్కలు
  • మున్సిపల్ శాఖ ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ(ఎఫ్​సీడీఏ) ఆఫీస్​ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. శనివారం రూ.19 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ (హెచ్ఎండీఏ) ఇలంబర్తి జీవో జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో(ప్యూచర్ సిటీ) అథారిటీ భవన నిర్మాణం చేపట్టనున్నారు. 

ఇందు కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి  ఎఫ్ సీడీఏ కమిషనర్ శశాంక  లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.19 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. కాగా, ఈ భవన నిర్మాణానికి  త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా  భూమి పూజ చేయడానికి మున్సిపల్ శాఖ  అధికారులు కసరత్తు చేస్తున్నారు.