రామచంద్రాపురం, వెలుగు: భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) హైదరాబాద్ యూనిట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా జి. సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు ఈడీగా పని చేసిన వై శ్రీనివాస రావు పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో సుబ్రహ్మణ్యంను నియమించారు. విశాఖపట్నం హెచ్పీవీపీ ఈడీగా పని చేసిన ఆయన అంతకుముందు హైదరాబాద్యూనిట్లో టర్బైన్ అండ్ కంప్రెషర్స్ జీఎంగా పని చేశారు.
