జీ20 మెనూలో భారతీయ రుచులు

జీ20 మెనూలో భారతీయ రుచులు

జీ20 సమ్మిట్ కోసం భారత్ వచ్చిన లీడర్స్ కోసం స్పెషల్ మెనూను తయారు చేశారు. ఇవాళ లంచ్ లో తందూరీ ఆలూ, కుర్కురీ బెండీ,జాఫ్రానీ పుట్టగొడుగుల పులావ్, పన్నీర్ తిల్వాల వంటివి అందించారు. మెయిన్ కోర్సులో పనసపండు బ్రెడ్ తో చేసిన ఫ్రెంచ్ వంటకం, గ్లేజ్ డ్ ఫారెస్ట్ మష్రూమ్, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్ రైస్ ,పలు రకాల బ్రెడ్ లతో పాటు ముంబై వడా పావ్ కూడా మెనూలో చేర్చారు.

ALSO READ : గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

డెజర్ట్ లో యాలకులు, ఊదలతో చేసే మధురిమ అనే ఫుడ్డింగ్, ఫిగ్ ఫీచ్ కంపోట్, ఆంబే మొహర్  క్రిస్పీస్, పాలు,గోధుమలతో చేసిన నట్స్ ఉంచారు. డ్రింక్స్ కోసం కాశ్మీరీఖావా, ఫిల్టర్ కాపీ, డార్జిలింగ్ టీ, పాన్ ఫ్లేవర్డ్ చాక్టె్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.