గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించిన  ప్రధాని మోదీ

ఢిల్లీ: గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆ సమావేశానికి 9 దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. జీవ ఇంధనాల అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ చేరాలని జి 20 సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.  పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దీంతో పర్యావరణ కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరతను అధిగమించొచ్చని ప్రధాని మోదీ అన్నారు.

ALSO READ : జీ20 అతిథులకు రాష్ట్రపతి విందు.. 170 మంది అతిథులు..

పర్యావరణంలో మార్పులు సంభవిస్తుండటంతో ఇంధన పరివర్తనం సాధించడం అత్యంత కీలకం అన్నారు ప్రధాని మోదీ. జీవ ఇంధన విషయంలో అన్ని దేశాలు కలిసి రావాలని  పిలుపునిచ్చారు. పెట్రోల్ లో 20 శాతం  ఇథనాల్ మిశ్రమాన్ని కలిపేలా చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు.  ప్రధాని మోదీ ప్రతిపాదనలకు కట్టుబడి ఉంటామని సభ్య దేశాలు ప్రకటించాయి. పర్యావరణ పరిరక్షణకు 100 బిలియన్ డాలర్లు ఇస్తామని ప్రపంచ దేశాలు ప్రకటించాయి.