G20 Summit 2023: ముగిసిన జీ 20..మోదీని ప్రశంసించిన అతిథులు

G20 Summit 2023:  ముగిసిన జీ 20..మోదీని ప్రశంసించిన అతిథులు
  • రెండో రోజు బిజీబిజీగా ప్రధాని
  •  వన్ ఫ్యూచర్ సెషన్ లో మోదీ చర్చలు
  •  కీలక అంశాలపై ఒప్పందాలు
  • 2024 జీ 20 ప్రెసిడెన్సీ బ్రెజిల్ కు అప్పగింత
  • మోదీని ప్రశంసించిన అతిథులు
  • వియత్నానికి బయల్దేరిన బైడెన్ 

దేశరాజధాని వేదికగా జీ20 సమావేశాలు ముగిశాయి.చివరి రోజు తొలి సెషన్  వన్ ఫ్యూచర్ లో ప్రధాని మోడీ కీలక చర్చలు జరిపారు. జీ20 దేశాల అధ్యక్షులతో ఆయన బిజీబిజీగా గడిపారు. కీలక అంశాలపై ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది.

 ఢిల్లీ డిక్లరేషన్ ను ఏకాభిప్రాయంతో  జీ20 సభ్యదేశాలు ఆమోదించిన విషయం తెలిసిందే..దురాక్రమణలకు దూరంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై అతిథులు మోడీని ప్రశంసించారు. రెండో సెషన్ ప్రారంభానికి ముందు దేశాధినేతలతో కలిసి మోదీ రాజ్ ఘాట్ కు వెళ్లారు. బ్రిటన్ ప్రధాని  రిషి సునాక్, బైడెన్ తో కలిసి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. వచ్చే ఏడాది రియో డి జెనీరోలో జరిగే జీ20 సమావేశాల అధ్యక్షతను బ్రెజిల్  అధ్యక్షుడు లూయిజ్,ఇనాసియోలులా డ  సిల్వాకు అప్పగించారు.

ALSOREAD:ఇకపై జీ 21 పిలవాలి.. ఎందుకో తెలుసా..?

 భారత్ యూపీఐ అమలుపై ఈయూ ప్రెసిడెంట్ ప్రశంసించారు. భవిష్యత్తు మొత్తం డిజిటల్ లావాదేవీలదే అని ఆయన కొనియాడారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ 20 సదస్సును ముగించుకుని వియత్నాం బయల్దేరి వెళ్లారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్ లో తొలిసారి పర్యటించారు. శుక్రవారం మొదలైన ఆయన పర్యటన తొలి రోజు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.