నేను మాస్ లీడర్‌ని .. సీఎం రేవంత్ నా చేతులు కట్టేశిండు : గడ్డం ప్రసాద్ కుమార్

నేను మాస్ లీడర్‌ని ..  సీఎం రేవంత్ నా చేతులు కట్టేశిండు :   గడ్డం ప్రసాద్ కుమార్

తాను మాస్ లీడర్ ను అని సీఎం రేవంత్ రెడ్డి తనకు స్పీకర్ పదవీ అప్పగించి తన కాళ్ళు ,చేతులు కట్టేశారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఊర్లల్లో తిరుగుతూ ,అందర్ని  కలిసి స్నేహం చేసే తనకు ఈ పదవీ చాలా కొత్తగా ఉందన్నారు. తనపై నమ్మకంతో సీఎం అప్పగించిన ఈ రాజ్యాంగ పదవీకి న్యాయం చేస్తానని తెలిపారు. 

హైదరాబాద్ రవీంద్రభారతిలో గోల్కొండ సాహితీ కళాసమితి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలుగు భాష చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల నుంచి శాసన సభాపతిగా నియమితులైన గడ్డం  ప్రసాద్ కుమార్  కు సాహిత్య, సాంస్కృతిక సంస్థలు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. 

రాష్ట్ర స్పీకర్ గా తన విధులను సక్రమంగా నిర్వర్తించి  మంచి  పేరు తెచ్చుకుంటానని గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు.  గత పాలకులు  కవులను దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని... తాను మాత్రం ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా వారికి అండగా ఉంటానని స్పీకర్ స్పష్టం చేశారు.