మంత్రులను కలిసిన రంజిత్ రెడ్డి

మంత్రులను కలిసిన రంజిత్ రెడ్డి

హైదరాబాద్ ,వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను, పలువురు మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,  కొండా సురేఖ, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు.

2009 తరువాత చేవెళ్లలో కాంగ్రెస్ గెలవలేదని, ఇప్పుడు గెలుపు అవకాశాలు ఉన్నాయని, ప్రచారం షురూ చేయాలని రంజిత్ రెడ్డికి స్పీకర్, డిప్యూటీ సీఎం, మంత్రులు సూచించారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు, కార్యకర్తలతో సమావేశం కావాలని చెప్పారు.