మహిళలకు తోడ్పాటు అందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు : గడ్డం సరోజా వివేక్

మహిళలకు తోడ్పాటు అందిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు : గడ్డం సరోజా వివేక్
  •     గడ్డం సరోజా వివేక్

బషీర్​బాగ్, వెలుగు: మహిళలకు ఇంటి నుంచి తోడ్పాటు అందిస్తే పురుషులతో సమానంగా ఏ రంగంలో అయిన రాణించగలుగుతారని విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం సరోజా వివేక్ అన్నారు. మాత రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో మాతా రమాబాయి అంబేద్కర్ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. 

ట్రస్టు ప్రతినిధులు బీఎన్ రత్న, కే శ్రీకళ, కట్టెల గణేశ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విమల గద్దర్, బోయి విజయభారతి, అప్పికట్ల నళిని, ఆకాశపు అచ్చమాంబ, బొమ్మకు హిమమాల, గంగాధరి ప్రమీల,  మల్లేపల్లి జయతో కలిసి గడ్డం సరోజకు మాతా రమాబాయి అంబేద్కర్ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సరోజా వివేక్ మాట్లాడుతూ.. మాత రమాబాయి అంబేద్కర్ ఎన్నో వివక్షలకు గురై అంబేద్కర్ కు అండగా నిలిచిందని కొనియాడారు. 

సమాజంలో కుల వివక్ష దూరమైనప్పుడు మనుషులంతా ఒకటే అనే భవన కలుగుతుందన్నారు. తాను కూడా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చానని, తన మామ గడ్డం వెనకటస్వామి, భర్త వివేక్ వెంకటస్వామి ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నానన్నారు. మహిళలకు ప్రోత్సాహం ఉంటే ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతారని తెలిపారు. అనంతరం  రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తన పూర్వీకులు అణగారిన వర్గాల పట్ల చూపిన వివక్షకు క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు.