మునుగోడు ఉపఎన్నిక బరిలో గద్దర్

మునుగోడు ఉపఎన్నిక బరిలో గద్దర్

ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. ఈ సందర్భంగా కేఏ పాల్ ఆమరణ దీక్ష విరమించారు. గద్దర్.. కేఏ పాల్ తో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అక్టోబర్ 2న పీస్ మీటింగ్ కు పోలీసులు పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ పాల్ ఆమరణ దీక్ష చేపట్టారు. 

గద్దర్ గతంలో తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతో సన్నిహితంగానే ఉన్నారు. తన కొడుకు కోసమే గద్దర్ కాంగ్రెస్ లో చేరారనే వాదనలున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.