V6 News

పవన్ కల్యాణ్.. నా తమ్ముడి కంటే ఎక్కువ : గద్దర్

పవన్ కల్యాణ్.. నా తమ్ముడి కంటే ఎక్కువ : గద్దర్

విప్లవ వీరుడు, పోరాట యోధుడు గద్దర్ మృతిపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యలుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమకారుడు గద్దర్  మరణం తీవ్ర విషాదకరమని  పవన్ అన్నారు.

ఇటీవల ఆస్పత్రికి వెళ్లి గద్దర్ ను పరామర్శించారు పవన్.. ఈ క్రమంలోనే పవన్, గద్దర మధ్య ఉన్న అనుభందాన్ని  గుర్తుచేస్తూ  పవన్  అభిమానులు సోషల్ మీడియాలో,ఫోటోలు  వీడియోలు షేర్ చేస్తున్నారు.  పవన్ అంటే తనకు చాలా ఇష్టమని.. తమ్ముడి కంటే ఎక్కువని గద్దర్ పలు ఇంటర్వ్యూలో చెప్పారు. తన ఇంటికి వెళ్లినప్పుడు పవన్ జేబులో ఎన్నిడబ్బులున్నా తీసుకుంటానని గద్దర్ అన్నారు. పవన్ కష్టాలు వచ్చినప్పుడు ఆదుకున్నాడని.. చాలా మంచివాడని గద్దర్ తెలిపారు.ఈ వీడియోలను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.