హైకోర్టులో గాదె ఇన్నయ్యకు ఊరట..ఉపా కేసులో బెయిల్ మంజూరు

హైకోర్టులో గాదె ఇన్నయ్యకు ఊరట..ఉపా కేసులో బెయిల్ మంజూరు

హైదరాబాద్, వెలుగు: గాదె ఇన్నయ్య అలియాస్‌‌ గాదె ఇన్నారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కేంద్రం నమోదు చేసిన ఉపా కేసులో షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలు వ్యక్తిగత బాండ్‌‌తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ప్రతి శుక్రవారం కేపీహెచ్‌‌బీ ఎస్‌‌హెచ్‌‌ఓ ముందు హాజరవ్వాలని షరతులు విధించింది.