ఇయ్యాల హైదరాబాద్‌‌‌‌కు గడ్కరీ

ఇయ్యాల హైదరాబాద్‌‌‌‌కు గడ్కరీ

10 నేషనల్‌‌‌‌ హైవేలకు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి

హైదరాబాద్, వెలుగు : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు సమీపంలోని జీఎంఆర్ ఎరీనాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. మరో 10 హైవేలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డితో పాటు నేషనల్‌ హైవేస్‌ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రూ.7,853 కోట్లతో 354 కిలోమీటర్ల మేర 12 జాతీయ రహదారులను నిర్మించనున్నారు.