శాంతినగర్, వెలుగు : వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో బుధవారం పాదయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాంతినగర్ లోని ఈశ్వరమ్మ ఆలయం నుంచి జుల్లకల్ శివాలయం వరకు 11 ఎండ్ల బండ్లతో డప్పుచప్పుళ్ల నడుమ 10 కిలోమీటర్లు తరలివెళ్లారు.
అనంతరం కృ-ష్ణా, తుంగభద్ర నదుల జలాలతో జులకల్ ఆలయంలో శివుడికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. యాత్రలో కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎనుముల నాగరాజు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరమణి, దస్తగిరి పాల్గొన్నారు.
