
- పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు అప్పగించారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. సీబీఐ విచారణ చేపట్టి బాధ్యులైన కేసీఆర్, హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, హరీశ్ రావు దోచుకున్నారని కవితనే వెల్లడించారని గుర్తుచేశారు. అవినీతి నుంచి కేసీఆర్, కేటీఆర్‌ను తప్పించాలని కవిత చూస్తున్నారని, అందుకే హరీశ్‌రావు పేరు మాత్రమే చెప్తున్నారన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని, వాళ్లు దోచుకోవటానికే పార్టీ పెట్టారని, తెలంగాణ కోసం కాదని ఆరోపించారు.