గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్... ఇట్స్ అన్ ప్రిడిక్టబుల్

గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్...  ఇట్స్ అన్ ప్రిడిక్టబుల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీ జంటగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా కి కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా తెలుగు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. 

ఈ సినిమాలో ఎస్.జె సూర్య, నవీన్ చంద్ర, అంజలి, సముద్రఖని, శ్రీకాంత్, సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురచూస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ ప్రేక్షకుల ముందుకురానే వచ్చింది. 

అయితే మొదటగా హెవీ క్రౌడ్  తో స్లో బిజిఎమ్ తో బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకోకడు లేడు.. కానీ వాడికి కోపం వస్తే..  అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఫైట్ సన్నివేశాలతోపాటూ రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ గెటప్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. ఇక సీనియర్ పొలిటీషయన్ పాత్రలో శ్రీకాంత్, సముద్రఖని, ఎస్ జె సూర్య, జయరామ్ తదితరులు కనిపించారు. అయితే వీరికి డైలాగ్ స్పేస్ కూడా పెద్దగా లేదు. 

ALSO READ : తగ్గేదెలా... హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ని దింపుతున్న కన్నడ హీరోలు..

చివరికి రామ్ చరణ్ ఐయాం అన్ ప్రిడిక్టబుల్   అంతో చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. అయితే ఈ టీజర్ లో హీరోయిన్ కియారా అద్వానీకి పెద్దగా డైలాగులు లేవు. ఇక ఎప్పటిలాగే తమన్ తన మాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైప్ పెంచాడు. ఆలోచింపజేసే పొలిటికల్ సన్నివేశాలు, డైరక్టర్ శంకర్ టేకింగ్ వంటివాటిని హైలెట్ చేస్తూ కట్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఈ విషయం ఇలా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కాబోతోంది. దీంతో తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.