హైదరాబాద్, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ పీసీసీ సేవాదళ్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష కొనసాగింది. సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ ఆధ్వర్యంలో పలువురు సేవాదళ్ కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ దీక్ష చేపట్టినట్లు జితేందర్ చెప్పారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను దశల వారిగా కొనసాగిస్తామని హెచ్చరించారు.
