- ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు వైద్యం
- విషమ పరిస్థితిలో గాంధీ ఆస్పత్రి ఎంసీయూలో ట్రీట్ మెంట్
పద్మారావునగర్, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న 45 ఏళ్ల గర్భిణికి గాంధీ హాస్పటల్ డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. గత నెల 27న గాంధీలో జాయిన్అయిన గర్భిణికి అద్భుత ట్రీట్మెంట్‌తో కాపాడి శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి..
ఆగస్ట్27న ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో కుప్పకూలిన 45 ఏళ్ల గర్భిణిని విషమ పరిస్థితుల్లో గాంధీ హాస్పిటల్‌లోని ఎంఐసీయూకు తరలించారు. ఆమెకు గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు, హైపోథైరాయిడిజంతో పాటు గుండెకు సంబంధించిన తీవ్రమైన పెరిపార్టమ్ కార్డియోమయోపతి (పీపీసీఎమ్), మెటబాలిక్ ఆసిడోసిస్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.అనంతరం మెకానికల్ వెంటిలేటర్‌పై ఉంచి, బీపీని కంట్రోల్చేశారు. క్రమంగా వెంటిలేటర్ సపోర్ట్‌ను తొలగించగా ఆమె కోలుకున్నారు. సెప్టెంబర్ 3న ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు. శుక్రవారం ఆమెను డిశ్చార్జ్‌చేశారు.
