గాంధీలో ఐసీసీయూ పునఃప్రారంభం

గాంధీలో ఐసీసీయూ పునఃప్రారంభం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌ గాంధీ దవాఖానలో ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్ (ఐసీసీయూ) మళ్లీ రోగులకు అందుబాటులోకి వచ్చింది. ఆర్ఫన్ రోగి సహాయత ట్రస్ట్, ఎస్వీఎస్ రెఫ్​కమ్ లిమిటెడ్ సంస్థల సహకారంతో అధునాతన వైద్య పరికరాలు, సౌకర్యాలతో ఈ యూనిట్​ను మంగళవారం పునఃప్రారంభించారు. గుండె జబ్బుల చికిత్సలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని సూపరింటెండెంట్ ప్రొ. వాణి, ప్రిన్సిపాల్ ప్రొ. ఇందిర తెలిపారు.