
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం (అక్టోబర్ 02) హైదరాబాద్ లంగర్ హౌజ్ లోని బాపూఘాట్ లో గాంధీ జయంతి వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. నివాళులు అర్పించారు.
మహాత్మా గాంధీ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గాంధీ చూపిన అహింసా మార్గం దేశాన్ని నడిపిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గడ్డం ప్రసాద్ సహా ఇతర నాయకులు పాల్గొన్నారు.
అంతకు ముందు రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ (విజయదశమి) శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగ, తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థించారు.