గణేశ్, మౌనిక రక్షణ బాధ్యత మీదే : విశారదన్ మహారాజ్

గణేశ్, మౌనిక రక్షణ బాధ్యత మీదే : విశారదన్ మహారాజ్
  • కుమ్మెర ఘటనలో బాధిత దంపతులను డీఎస్పీకి అప్పగించిన విశారదన్​ మహారాజ్

నాగర్​ కర్నూల్, వెలుగు: కుమ్మెర బాధితులకు న్యాయం జరిగేంత వరకు డీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సంఘాలు పోరాడుతాయని డీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్​ మహారాజ్ తెలిపారు. శుక్రవారం రాత్రి గణేశ్, మౌనిక దంపతులను నాగర్​కర్నూల్​ డీఎస్పీ బి.శ్రీనివాస్​కు అప్పగించారు. కుమ్మెర గ్రామంలో బాధిత దంపతులు పని చేసుకుని జీవించే వాతావరణం కల్పించాలని కోరారు.

పసిపాపను కోల్పోయిన గణేశ్, మౌనిక దంపతులకు న్యాయం చేయాలని హైదరాబాద్​లో వివిధ దశల్లో  ఆందోళనలు చేశామని తెలిపారు. ఘటనకు కారణమైన 8 మందిలో ఐదుగురిని మాత్రమే అరెస్ట్​  చేశారని, మిగిలిన ముగ్గురిని ఎప్పుడు అరెస్ట్​ చేస్తారని ప్రశ్నించారు. గణేశ్​ ఫ్యామిలీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని పేర్కొన్నారు.

పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్​ తెలిపారు. గణేశ్, మౌనికకు భద్రత కల్పిస్తామని చెప్పారు. డీఎస్పీ, ప్రజాసంఘాల నాయకులతో పాటు బీసీ జేఎసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ శ్రావణి పాల్గొన్నారు.​