ఇవాళ( సెప్టెంబర్ 7)మధ్యాహ్నం వరకు నిమజ్జనం

ఇవాళ( సెప్టెంబర్ 7)మధ్యాహ్నం వరకు నిమజ్జనం
  • చాలా చోట్ల నుంచి సాయంత్రం, 
  •  రాత్రి వేళల్లో బయల్దేరిన గణనాథులు 
  • కొన్ని చోట్ల రాత్రి 10 గంటలకు శోభాయాత్రలు షురూ

హైదరాబాద్ సిటీ, వెలుగు :హుస్సేన్ సాగర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బడా గణేశ్​శోభాయాత్ర జరగడంతో మండప నిర్వాహకులు ఎవరూ తమ గణనాథులను నిమజ్జనం చేసేందుకు బయలుదేరలేదు. మధ్యాహ్నం నిమజ్జనం పూర్తయ్యాక సాయంత్రం నుంచి విగ్రహాల రాక మొదలైంది. 

అన్నీ ఒక్కసారిగా బయలుదేరడంతో చాలా ప్రాంతాల్లో శోభాయాత్రలు ఆలస్యమయ్యాయి. హుస్సేన్ సాగర్ కు అర్ధరాత్రి తర్వాతే ఎక్కువగా విగ్రహాలు తరలివచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 గంటలకు శోభాయాత్రలు ప్రారంభించారు. ఇవన్నీ ఆదివారం ఉదయం తర్వాతే సాగర్ కు చేరుకునే అవకాశముంది. దీన్ని గ్రహించే పోలీసులు కూడా ఆదివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్​ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు.