- ప్రారంభమైన పనులు.. వచ్చే వినాయక చవితి నాటికి రెడీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్యాంక్‌బండ్ పరిసరాలు మరిన్ని హంగులు అద్దుకుంటోంది. పర్యాటక అందాలను పెంచుతూనే, వినాయక నిమజ్జన వేడుకలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద ప్రత్యేక ప్లాట్‌ఫారాలను నిర్మిస్తున్నది. ఏటా అత్యంత వైభవంగా జరిగే గణేశ్ నిమజ్జనం వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హెచ్‌ఎండీఏ అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే క్రేన్ల వినియోగానికి అనుకూలంగా ఉండేలా ఎన్టీఆర్ గార్డెన్‌కు ఎదురుగా రెండు చోట్ల భారీ ప్లాట్‌ఫారాలను నిర్మిస్తున్నారు. ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే వినాయక చవితి నాటికి ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

