హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు.. సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు అలర్ట్

హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు.. సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు అలర్ట్

నిమజ్జనాల సందర్భంగా సిటీ బస్సులను మసాబ్ ట్యాంక్, వి.వి. విగ్రహం, సికింద్రాబాద్ గడియారపు స్థంభం, తార్నాక, దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్, ఆరాంఘర్ వరకే అనుమతిస్తారు. జిల్లాల నుంచి వచ్చి వెళ్లే బస్సులు ఎంజీబీఎస్​చేరుకోవడానికి ఆల్టర్నేట్​రూట్లను కేటాయించారు.

భారీ లారీలను సిటీలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ లారీలను శివార్లలోనే నిలిపివేసి ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ వైపు మళ్లించనున్నారు.

శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్‌‌‌‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పరిస్థితిని బట్టి ఈ సమయాన్ని పొడిగించే అవకాశం ఉందని పోలీసులు ప్రకటించారు.

ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లో నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతర వాహనాలు ఆల్టర్నేట్​రూట్లలో వెళ్లాలని సూచించారు. సాధారణ వాహనదారులు ఇన్నర్​ రింగ్​రోడ్తో పాటు మసాబ్‌‌‌‌ట్యాంక్‌‌‌‌, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌‌‌‌ రూట్, ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డును వినియోగించాలని సూచించారు.