రికార్డ్ బ్రేక్..60లక్షలు పలికిన గణపయ్య లడ్డూ

రికార్డ్ బ్రేక్..60లక్షలు పలికిన గణపయ్య లడ్డూ

హైదరాబాద్ బండ్లగూడలో గణేష్ లడ్డూ ఏకంగా 60 లక్షలు పలికింది. రిచ్మండ్ విల్లా కాలనీలో డాక్టర్ సాజీ డిసౌజా 60 లక్షల 80 వేల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. ఈ వేలంలో కాలనీ వాసులు పోటా పోటీగా పాల్గొన్నారు. 

గణనాథుడి లడ్డూ దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ సాజీ డిసౌజా బృందం తెలిపింది. కులం, మతం కాదు  అందరికీ మానవత్వమే ఉండాలని చెప్పారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బులను ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సాయం చేస్తామని నిర్వహకులు తెలిపారు. నిజమైన  పేదలను గుర్తించి వారికే నేరుగా హెల్ప్ చేస్తామన్నారు.