వర్షాకాలం రోగాలకు యోగాతో బై-బై.. ఈ ఆసనాలు వేస్తే జలుబు, దగ్గు మాయం!

వర్షాకాలం రోగాలకు యోగాతో బై-బై.. ఈ ఆసనాలు వేస్తే జలుబు, దగ్గు మాయం!

వర్షా కాలంలో జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. కొందరికైతే చినుకు పడితే చాలు తుమ్ములు మొదలవుతాయి. గొంతు, ఛాతి నొప్పులు కూడా బాగా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలను నుంచి కాస్త రిలీఫ్ అవ్వాలంటే వారానికి ఐదురోజులు ఈ ఆసనాలు వేయాలి. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గులని అదుపులో ఉంచే యోగాసనాలివే...

మత్స్యాసనం
ఈ ఆసనం కోసం యోగా మ్యాట్ పై వెల్లకిలా పడుకోవాలి. తరువాత నెమ్మదిగా రెండు మోచేతులను ఫొటోలో చూపినట్లు పిరుదలకు దగ్గరగా నేలకు ఆన్చాలి. మెల్లగా తలను నేలమీద ఉంచే ప్రయత్నం చేస్తూ మాడని నేలకు ఆన్చాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు శ్వాసను మామూలుగా తీసుకుని వదులుతూ 20 నుంచి 30 సెకన్ల పాటు ఉండాలి. తల మీద ఎక్కువ బరువు వేయకూడదు. ఈ ఆసనం బాగా అలవాటయ్యేదాకా ఆరుసార్లు దీర్ఘంగా శ్వాసతీసుకుని వదలాలి. దీనివల్ల ఛాతిలో, భుజాల్లో, గొంతు దగ్గర ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. మోకాళ్ల నొప్పులున్న వాళ్లు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి..

బాలాసన
ఈ ఆసనం కోసం మోకాళ్లని మడిచి పిరుదులు కాలి పాదాలపై ఆన్చాలి. ఫొటోలో చూపిన విధంగా శరీరాన్ని ముందుకు వంచి ఛాతి మోకాళ్లకు అనేలా చూసుకోవాలి. తర్వాత నుదుటిని నేలకు ఆనించి చేతులను ముందుకు చాపాలి. ఈ పొజిషన్లో పదిసార్లు గాలి పీలుస్తూ వదలాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు, తలనొప్పి నుంచి నిమిషాల్లో ఉపశమనం పొందొచ్చు. గొంతు ఇన్ఫెక్షన్లని కూడా ఈ అససం దూరంగా ఉంచుతుంది. అంతేకాదు ఈ ఆసనం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అలోమ - విలోమ ప్రాణాయామం
వర్షాకాలంలో తప్పకుండా చేయాల్సిన ప్రాణాయామం ఇది. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్లకి ఈ ఆసనం ఉపశమనాన్ని ఇస్తుంది. సుఖాసనంలో కూర్చొని వెన్నెముకని నిటారుగా ఉంచాలి. ఎడమచేతి వేలిని చిన్ ముద్రలో ఉంచాలి. అంటే బొటని వేలు, చూపుడి వేలుని కలిపి మిగిలిన వేళ్లని నిటారుగా పెట్టాలి. దాన్ని ఎడమ తొడ మీద ఉంచి.. కుడి చేతి మధ్య వేలు, చూపుడు వేలుని మడిచి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. ముందుగా కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కుతో ఊపిరి తీసుకోవాలి. ఇలా నాలుగు సెకన్లు ఉన్నాక బొటనవేలు తీసేసి కుడి ముక్కు నుంచి గాలిని బయటకు నెమ్మదిగా వదలాలి. తర్వాత కుడి ముక్కుతో శ్వాస తీసుకుని ఎడమ ముక్కుతో గాలి వదలాలి. ఇలా ఐదు నుంచి పది నిమిషాలు వరకు మార్చి మార్చి వేయాలి. ఈ ఆసనం వల్ల జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ దొరుకుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.

ఉక్తాసనం
నిటారుగా నిలబడి చేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. తర్వాత ఫొటోలో చూపినట్టుగా శరీరాన్ని ముందుకు వంచి చేతి వేళ్లతో రెండు కాళ్ల మడమలు పట్టుకోవాలి. ఈ పొజిషన్లో 60 సెకన్లు ఉండి తర్వాత నెమ్మదిగా పైకి లేస్తూ తిరిగి నమస్కార ముద్రలోకి రావాలి. ఇలా చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే తగ్గుతాయి. దగ్గు, జలుబుల నుంచి కూడా రిలీఫ్ వస్తుంది.
శ్వాసతీసుకుని వదలాలి. దీనివల్ల ఛాతిలో, భుజాల్లో, గొంతు దగ్గర ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. మోకాళ్ల నొప్పులున్న వాళ్లు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి..

సర్వాంగాసనం
ఈ ఆసనం కోసం యోగా మ్యాట్ పై వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లని నెమ్మదిగా పైకి లేపుతూ 90 డిగ్రీల కోణంలోకి తీసుకురావాలి. తర్వాత ఫొటోలో చూపిన విధంగా రెండు చేతుల్ని నడుముకి అనించి శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ పొజిషన్లో 60 నుంచి 120 సెకన్లు ఉండి కాళ్లని నెమ్మదిగా కిందకి దించాలి. ఈ ఆసనం వల్ల కాలి బొటనవేలు నుంచి రివర్స్ యాంగిల్ లో తల వరకు రక్తప్రసరణ జరుగుతుంది. ఈ ఆసనాన్ని రోజుకి మూడుసార్లు చేస్తే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు. గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి కూడా బయటపడొచ్చు.