గాంధీలో ఘనంగా గణేశ్ నవరాత్రులు

గాంధీలో ఘనంగా గణేశ్ నవరాత్రులు

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ హాస్పిటల్ ఆవరణలో గణేశ్​నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. టీఎన్జీవో ఉద్యోగ సంఘం గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, సేవా భావం పెరుగుతుందన్నారు. 

ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న టీఎన్జీవో గాంధీ యూనిట్​ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, ఆర్ఎంవో డాక్టర్ జయకృష్ణ, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా సెక్రటరీ విక్రమ్, అసోసియేట్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నరేశ్ కుమార్, శ్రీనివాస్, గాంధీ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జి. ప్రభాకర్, అమృత ప్రసన్నానంద్, యాదిలాల్, ట్రెజరర్ శ్రవణ్ కుమార్, నాయకులు సలీం, సరళ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.