హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్, ఇతర పెద్ద చెరువులతో పాటు బేబీ పాండ్స్‌లో ఆదివారం భారీ సంఖ్యలో గణనాథుల నిమజ్జనం జరిగింది. సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను తీసుకువచ్చారు. పీపుల్స్ ప్లాజా వద్దనే ఎనిమిది క్రేన్ పాయింట్లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు చేశారు. గణనాథులను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలు సందడిగా మారాయి.
- హైదరాబాద్ సిటీ, వెలుగు
కెన్యాలో ఎంవోఎంటీఏ ఆధ్వర్యంలో..
కెన్యా దేశంలోని మొంబాసా నగరంలో మొంబాసా తెలుగు అసోసియేషన్(ఎంఓఎంటీఏ) ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తోన్న వినాయక చవితి వేడుకలు ముగిశాయి. ఆదివారం గణనాథుడిని పడవలో తీసుకెళ్లి హిందూ మహాసముద్రంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. - పద్మారావునగర్, వెలుగు
సరూర్‌నగర్‌లో 3,200 విగ్రహాల నిమజ్జనం..
సరూర్‌నగర్‌లోని మినీ ట్యాంక్‌బండ్‌కు వినాయక విగ్రహాలను భారీగా తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 3200 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
- దిల్ సుఖ్ నగర్
