అబ్దుల్లా పూర్‌మెట్ ఇండి క్యాష్ ఏటీఎంలో చోరీ చేసిన దొంగలను పట్టుకున్నాం

అబ్దుల్లా పూర్‌మెట్ ఇండి క్యాష్ ఏటీఎంలో చోరీ చేసిన దొంగలను పట్టుకున్నాం
హైదరాబాద్: సెక్యూరిటీ లేని ATMలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. హర్యానా, UP, రాజస్థాన్ కి చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు రాచకొండ సీపీ మషేష్ భగవత్. ఈ గ్యాంగ్ మొత్తం 11 ATMలలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. వీరి దగ్గర నుంచి టాటా సుమోతో పాటు… 73 వేల నగదు, ఆక్సిజన్ సిలిండర్ ను రికవరీ చేసుకున్నట్లు తెలిపారు. అబ్దుల్లా పూర్‌మెట్ ఇండి క్యాష్ ఏటీఎంలో గ్యాస్ కట్టర్‌తో మిషన్ బ్రేక్ చేశారని, రూ. 35 వేల 800 నగదు పోయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఈ చోరీకి పాల్పడింది.. హర్యానా గ్యాంగ్ అని మోవత్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించామన్నారు.  చోరీలకు పాల్పడిన వారు నార్త్ ఇండియా నుంచి లారీలో వచ్చి ఇక్కడ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.