
హైదరాబాద్ : ఆరుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు రాచకొండ ఎస్ వోటీ పోలీసులు. నిందితుల నుంచి 550 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. గంజాయి విలువ కోటి 57 లక్షల 45 వేలుగా ఉంటుందని గుర్తించారు. 4 కార్లు, 5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏపీ లంబసింగి, భద్రాచలం ఏజెన్సీ నుంచి గంజాయిని... హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు సీపీ మహేశ్ భగవత్.