గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో.. నేను వస్తే మోత మోగిపోద్ది

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో.. నేను వస్తే మోత మోగిపోద్ది

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, సోమవారం రెండో పాటను రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఎం.ఎం. మానసి పాడిన విధానం ఆకట్టుకుంది.  

‘కొవ్వూరు ఏరియాలో ఎవరు కట్టని సీర కట్టి.. కడియపులంక పరిసరాల్లో ఎవరు పెట్టని పూలు పెట్టి.. గోదారి గలగలలు  అన్నీ  గాజుల్లాగా సేతికి తొడిగి..  నేను వస్తే మోత మోగిపోద్ది..’ అంటూ సాగే పాటలో విశ్వక్ సేన్ ఎర్ర లుంగీ, ఎర్ర చొక్కాతో, మీసం మెలేసి మాస్ గెటప్‌‌‌‌‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు.  ఆయేషా ఖాన్ గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. నేహా శెట్టి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. మే 17న సినిమా విడుదల కానుంది.