
ఉద్యమమే ఊపిరిగా జీవితాంతం కృషి చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.అనంతరం మాట్లాడిన ఆయన..చేనేత సమస్యలపై, వెనకబడిన కులాల అభివృద్ధికోసం అలుపెరుగని పోరాటం చేసారని అన్నారు. తన ఇంటినే తెలంగాణ ఉద్యమం కోసం ఇచ్చిన మహా నేత అని కొనియాడారు. స్వార్థ పరమైన నేతలు కొందరు కొండా లక్ష్మన్ బాటలో నడవలేకపోయారని అన్నారు.రాష్ట్ర సాధన కోసం ఆయన అలుపెరగని పోరాటం చేసారని అన్నారు గంగుల కమలాకర్.