ఆర్టీసీ సమ్మెను రాజకీయాలకు వాడొద్దు: గంగుల

ఆర్టీసీ సమ్మెను రాజకీయాలకు వాడొద్దు: గంగుల

బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సమ్మెను తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏనాడు చెప్పలేదన్నారు.  బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసిని విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు.నాయకుల స్వలాభం కోసం కార్మికులను బలి చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు. అశ్వత్థామ రెడ్డి వెనక ఏ పార్టీ ఉందో తెలుసుకోవాలన్నారు గంగుల.