
రాష్ట్రంలో జూన్ 2 నుంచి నిరుద్యోగులకు అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. దేశంలో తొలిసారిగా ప్రతీ నియోజకవర్గానికి బీసీ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్ క్లాసుల కోసం బీసీ స్టడీ సర్కిల్ డిజిటల్ స్టూడియోను మంత్రి ప్రారంభించారు. డిజిటల్ పాఠాలతో .... లక్షలాది విద్యార్ధులకు మేలు కలుగుతుందన్నారు గంగుల. అంతకుముందు జ్యోతి బా పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు నేతలు.