హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి భగీరథ్ కేసులో తాము బాధితురాలి పక్షానే ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తమ ఒత్తిడితోనే సంజయ్ కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. ఈ అంశానికి కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇది కుల సమస్య కాదని, లా అండ్ ఆర్డర్ సమస్య అని పేర్కొన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌లో బెదిరింపు ధోరణిలో మాట్లాడారని మండిపడ్డారు.
