గిల్ ఫుట్‌‌ మూవ్‌‌మెంట్‌‌ బాగుంది: గంగూలీ

గిల్ ఫుట్‌‌ మూవ్‌‌మెంట్‌‌ బాగుంది: గంగూలీ

కోల్‌‌కతా: ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌లో టీమిండియా కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ ఫుట్‌‌ మూవ్‌‌మెంట్‌‌ బాగుందని లెజెండ్‌‌ బ్యాటర్‌‌ సౌరవ్‌‌ గంగూలీ కితాబిచ్చాడు. దాన్ని అలాగే కొనసాగిస్తే విదేశీ సిరీస్‌‌ల్లో చాలా రన్స్‌‌ చేస్తాడని చెప్పాడు. ‘ఇంగ్లిష్‌‌ బౌలర్లు ఎక్కువగా మిడిల్‌‌, ఆఫ్‌‌ లైన్‌‌లో బౌలింగ్‌‌ చేశారు. ఈ సవాల్​ను గిల్‌‌ ఈజీగా అధిగమించాడు. వీ ప్రాంతంలో కొన్ని అద్భుతమైన డ్రైవ్స్‌‌తో తనపై ఉండే ఒత్తిడిని తొలగించుకున్నాడు. వికెట్లకు దూరంగా అతని పాదాల కదలిక చాలా బాగా అనిపించింది. ఎక్కడా తప్పు కనిపించలేదు.

ఇలాంటి వికెట్‌‌పై ముందుగా బౌలింగ్‌‌ చేయకూడదు. అందుకే ఇంగ్లిష్ బౌలర్లు ఫెయిలయ్యారు. గిల్‌‌ ఫుట్‌‌ మూవ్‌‌మెంట్‌‌ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఇలాగే ఆడితే సగటు కూడా 40, 45కు పెరుగుతుంది. ఈ ఇన్నింగ్స్‌‌ అతనిలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్వింగ్‌‌ను ఎదుర్కొన్న టెక్నిక్‌‌ చాలా బాగుంది’ అని దాదా వెల్లడించాడు. నాలుగో నంబర్‌‌లో కోహ్లీ లేని లోటును గిల్ త్వరలోనే భర్తీ చేస్తాడన్నాడు. రోహిత్‌‌, కోహ్లీ, అశ్విన్‌‌ లేకుండా సిరీస్‌‌ ఆడుతున్న ఇండియాకు ఇది కఠినమైన పరివర్తన దశ అవుతుందన్నాడు. ప్రారంభం బాగుంది కాబట్టి రాబోయే రోజుల్లోనూ దీన్ని కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్‌‌ కూడా అద్భుతమైన బ్యాటర్‌‌గా రాణిస్తాడని, అతను అన్ని ఫార్మాట్లలో ఆడాలని గంగూలీ సూచించాడు.