నా దగ్గర సమాధానం లేదు..ఐపీఎల్-13పై గంగూలీ

నా దగ్గర సమాధానం లేదు..ఐపీఎల్-13పై గంగూలీ

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఒలింపిక్స్‌‌ వాయిదా పడినా ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌(ఐపీఎల్‌‌) విషయంలో మాత్రం సస్పెన్స్‌‌ కొనసాగుతూనే ఉంది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో 13వ సీజన్‌‌కు సంబంధించి తన దగ్గర కూడా జవాబు లేదని బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ తేల్చిచెప్పాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమీ చెప్పలేను. లీగ్‌‌ను పోస్ట్‌‌పోన్‌‌ చేసిన రోజు ఎలా ఉన్నామో ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాం. ఈ పది రోజుల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. అందువల్ల నా దగ్గర కూడా బదులు లేదు. సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫ్యూచర్‌‌ టూర్‌‌ ప్రొగ్రామ్‌‌(ఎఫ్‌‌టీపీ) ఉండడంతో నాలుగైదు నెలల తర్వాత లీగ్‌‌ నిర్వహించడంపై ఇప్పుడే ఎలాంటి ప్లాన్‌‌ చేయలేం. ఎఫ్‌‌టీపీని మార్చే చాన్స్‌‌ లేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌‌తోపాటు అన్ని ఆటలు ఆగిపోయాయి.నష్టం తగ్గించేందుకు ఫ్రాంచైజీలకు ఇన్సూరెన్స్‌‌ కవరేజ్‌‌ లభిస్తుందో లేదో నాకు తెలీదు. అన్నింటిని ముందుగా అంచనా వేయలేం. కొంతకాలం ఎదురు చూడక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పష్టమైన సమాధానం ఇవ్వమంటే నా వల్ల కాదు’ అని  దాదా చెప్పాడు.కరోనాను ఎదుర్కోనేందుకు బీసీసీఐ తరఫున ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించే ఆలోచన ఉందన్నాడు.  కాగా, ప్రధాని మోడీ..ఏప్రిల్ 15వరకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ప్రకటించడంతో రద్దుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒలింపిక్స్ వాయిదా పడినప్పుడు ఈ పరిస్థితుల్లో లీగ్​ను రద్దు చేయకపోతే మూర్ఖత్వమే అవుతుందని బోర్డు సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.