ఒళ్లు గగుర్లుపొడిచే సీన్..ప్యాంట్లో దాచి 104 పాములు అక్రమరవాణా..బార్డర్లో చిక్కిన స్నేక్స్ స్మగ్లర్

ఒళ్లు గగుర్లుపొడిచే సీన్..ప్యాంట్లో దాచి 104 పాములు అక్రమరవాణా..బార్డర్లో చిక్కిన స్నేక్స్ స్మగ్లర్

పామును చూస్తేనే అంతదూరం ఎగిరి దుంకుతాం..మరి దగ్గరగా వస్తే భయంతో పరుగులు పెడతాం..అలాంటిది ఓ వ్యక్తి పాములను ప్యాంట్లో పెట్టుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించి సరిహద్దులు దాటేందుకు యత్నించాడు. అతడి ప్యాంట్లో ఉన్న కుప్పలుకుప్పలుగా ఉన్న పాములను చూసి అధికారులంతా షాక్ అయ్యారు. వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని చైనా,హాంకాంగ్ బార్డర్ లో అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

హాంకాంగ్ నుంచి చైనాకు పాములను అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి హాంకాంగ్,షెంజెన్ బార్టర్లో కస్టమ్స్ అధికారులు చిక్కాడు. తనిఖీ లసమయంలో స్మగ్లర్ ప్యాంట్లో దాచిన డ్రాస్ట్రింగ్ బ్యాగుల్లో దాచి పెట్టిన పాములను షాక్ అయ్యారు. ఈ బ్యాగుల్లో దాదాపు 104 వివిధ రకాల జాతులకు చెందిన పాములున్నాయి. దీంతో వన్యప్రాణుల అక్రమ రవాణాపై ఆందోళన, చైనా బయోసెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తం చేశారు అధికారులు.  

Also Read : ఇరాన్‌ అరక్ అణు రియాక్టర్‌పై దాడి

హాంకాంగ్ నుంచి చైనాకు 100కు పైగా పాములను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని చైనా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. చైనా కస్టమ్స్ అథారిటీ ప్రకారం ..స్మగ్లర్లు ప్యాంట్లో పాములతో కూడిన సంచులు బయటపడ్డాయి. వివిధ రకాల ఆకారం, పరిమాణం,రంగులో ఉన్న పాములు ఆ వ్యక్తి ప్యాంటులో బయటపడ్డాయి. 
100పాములను అక్రమంగా రవాణాచేస్తూ వ్యక్తి పట్టుబడటంతో వన్యప్రాణుల అక్రమరవాణాపై ఆందోళన లేవనెత్తిప్పటికీ..వివిధ రకాల జాతుల పాములు పట్టుబడటంతో ఈ ఘటన ఆసక్తి రేకెత్తించింది. 

జంతువుల అక్రమ రవాణాకు కేంద్రంగా ఉన్న హాంకాంగ్  వన్యప్రాణుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలుచేస్తోంది. చైనా కఠినమైన బయోసెక్యూరిటీ రూల్స్ అమలు చేస్తోంది. అనుమతి లేకుండా స్థానికేతర జాతుల దిగుమతిని నిషేధించింది. కస్టమ్స్ అథారిటీ చెప్పిన వివరాల ప్రకారం చట్టాలను ఉల్లంఘించేవారి పై చట్టపరమైన చర్యలు అమలు చేస్తోంది. అయితే 104 పాములు ప్యాంట్లో దాచుకొని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తికి ఏ శిక్ష పడిందో ఇంకా తెలియలేదు.