
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్టార్క్ ను స్లెడ్జింగ్ చేశాడు. స్టార్క్ వైపు చూస్తూ నీ బంతి చాలా స్లో గా వస్తుంది అని జైశ్వాల్ అన్నాడు. దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆసీస్ బౌలర్ పై సెటైర్ వేయడం షాక్ కు గురి చేసింది. స్టార్క్ మాత్రం సైలెంట్ గా ఉండి బంతితోనే సమాధానమిచ్చాడు. ఈ సిరీస్ లో ఆ తర్వాత స్టార్క్ బౌలింగ్ లో జైశ్వాల్ చాలా సార్లు ఔటయ్యాడు. వీరిద్దరి బ్యాటిల్ పై ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లాండ్‌తో టీమిండియా శుక్రవారం (జూన్ 20) తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా మిచెల్ స్టార్క్‌తో జైస్వాల్ చేసిన స్లెడ్జింగ్ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని జైశ్వాల్ ను ఉద్దేశించి మాట్లాడాడు. హిందూస్తాన్ టైమ్స్ తో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. "పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ మాపై ఆధిపత్యం చెలాయించాడు. ఆ తర్వాత స్టార్క్ అద్భుతంగా రాణించి రివెంజ్ తీర్చుకున్నాడు. ఇలాంటి బ్యాటిల్స్ ఆటకు ఆకర్షణగా నిలుస్తాయి. వీరిద్దరి మధ్య బ్యాటిల్ ముచ్చట గొలిపేలా ఉంది". అని ఈ ఆసీస్ దిగ్గజం అన్నాడు.
ఇదిలా ఉంటే ఆడమ్ గిల్‌క్రిస్ట్ యశస్వి జైస్వాల్‌ను ఫ్యూచర్ బిగ్ సూపర్‌స్టార్‌గా అభివర్ణించాడు. అతని పరిణతి, ఒత్తిడిలో ఆడగల సామర్ధ్యాన్ని కొనియాడాడు. ఇక ఆస్ట్రేలియాతో తన తొలి టెస్ట్ పర్యటనలోనే జైస్వాల్ ఆకట్టుకున్నాడు. ఈ 23 ఏళ్ల ఆటగాడు ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో 43 యావరేజ్ తో 391 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. తన బ్యాటింగ్ తో జైశ్వాల్ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు స్టార్క్ 28.66 యావరేజ్ తో 18 వికెట్లు పడగొట్టాడు.
Adam gilchrist On Yashsavi Jaiswal vs Starc - " Every Dog Has His Day " 😭 pic.twitter.com/Dw4Xe5WVd8
— Honest Cricket Lover (@Honest_Cric_fan) June 19, 2025